మద్యం సేవించి వాహనాలు నడపరాదు
1 min read

ప్యాపిలి , న్యూస్ నేడు: మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఏఎస్ఐలు శ్రీనివాసులు ,మురళి కృష్ణ పేర్కొన్నారు .ఈ సందర్భంగా సోమవారం ప్యాపిలి పట్టణ శివార్లలోని బనగానపల్లి క్రాస్ రోడ్డు వద్ద ప్యాపిలి పట్టణ పోలీసులు డ్రంక్ న్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా ద్విచక్ర వాహనాలు డ్రైవింగ్ చేస్తున్న ప్రయాణికులను తనిఖీలు నిర్వహిస్తూ, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, వాటి వలన ప్రమదలకు గురైన వారి కుటుంబాలు రోడ్డు న పడతాయని వారు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చట్టానికి అనుగుణంగా నడుచుకోవాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్యాపిలి పట్టణ పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్యాపిలి పట్టణ పోలీసులు పాల్గొన్నారు.


