NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆశ కార్యకర్తలకు  ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి

1 min read

జిల్లా కార్యదర్శి రమణ కుమారి

ప్యాపిలి, న్యూస్​ నేడు: ప్యాపిలి మండలం జల్దుర్గం పి. హెచ్. సి సెంటర్లో ఆశా కార్యకర్తల సమావేశం గార్లదిన్నె లక్ష్మీదేవి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణకుమారి సిఐటియు ప్యాపిలి మండల ప్రధాన కార్యదర్శి ఎస్.ఎ. చిన్న రహిమాన్ మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు కనీస వేతనం 26 వేలు రూపాయలు ఇవ్వాలని, 18 సంవత్సరాల నుండి ఆశా వర్కర్ గా పనిచేస్తున్న నేటికీ వేతనం పెరగడం లేదన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ అమలు చేయాలి, ప్రతి ఒక్క ఆశ వర్కర్ కు కొత్త సెల్ ఫోన్ మరియు 5జి సిమ్ములులు ఇవ్వాలి, ఒప్పందం జీవోలు అమలు చేయాలి, మట్టి ఖర్చులకు జీవో అమలుచాలి, ఆశ వయస్సు 60 సంవత్సరాలు నిండు న టువంటి వారికి రిటైర్మెంట్ చేయరాదు ,62 సంవత్సరాల కు పెంచాలి, జీవో విడుదల చేయాలి,62 సంవత్సరాలు జీవో వచ్చేవరకు ఆశలకు రిటైర్మెంట్ చేయరాదు. ఆశా కార్యకర్తలకు రికార్డులను ప్రభుత్వమే ఇవ్వాలి, ప్రభుత్వ సెలవులు మరియు ప్రసనానంతర సెలవులను ఆశ కార్యకర్తలకు ఉండేటట్లు చూడాలి, డెలివరీ కేసుకు వచ్చినప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ గర్భవతులు చెకప్ సేవలందించడం కోసం వచ్చినప్పుడు ఆశాలకు రవాణా చార్జీలను మరియు రోజువారి ఖర్చులకు ఇవ్వాలి, గ్రామంలో పట్టణం ప్రాంతంలో ఎక్కువ జనాభా ఉన్న చోట అదనపు ఆశలను నియమించాలి, వేరే సచివాలయం లోకి ట్రాన్స్ఫర్ కావాలి, గల్లా పరీక్షల బాక్స్ ఆశలతో తెప్పించరాదన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపి ఎస్ మండల నాయకులు రాజకుమార్, సరోజమ్మ, సరస్వతి ,సుభద్ర, పద్మావతి, రాధమ్మ ,తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగినది అధ్యక్షులు :ఎం. లక్ష్మీదేవి, (గార్లదిన్నె) ఉపాధ్యక్షులు యు. కృష్ణవేణి( రామకృష్ణాపురం) కార్యదర్శి  రామలక్ష్మి (బురుగల) సహయ కార్యదర్శి దేవమ్మ ( హుసేనాపురం) కోశాధికారి నాగలక్ష్మి (ఊటకొండ)  కమిటీ నెంబర్స్ కవిత, లక్ష్మి భాయ్, గుర్రమ్మ, ఫిరంబి ,కమల, సుబ్బలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

About Author