NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పత్తికొండ పట్టణంలో బీసీ బాలికల వసతి గృహం ఏర్పాటు చేయాలి

1 min read

ఏఐఎస్ఎఫ్ డిమాండ్ డిమాండ్ 

పత్తికొండ, న్యూస్​ నేడు : పత్తికొండలో బీసీ బాలికల వసతి గృహం ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఆర్డిఓ భరత్ నాయక్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి శివ, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు హనుమేష్ ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి అల్తాఫ్ మాట్లాడుతూ, పత్తికొండలో ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని, పత్తికొండ బీసీ బాలికల వసతి గృహంలో దాదాపు 250 విద్యార్థులు దాకా ఉన్నప్పటికీ అందులో విద్యార్థులకు రాత్రిపూట పడుకోవడానికి కూడా స్థలం లేదని అన్నారు. అలాగే వర్షాకాలంలో వర్షాలు పడటం వలన హాస్టల్ కూడా కారుతుందని, పత్తికొండలో బీసీ హాస్టల్ లేకపోవడం వలన విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 సంవత్సరాలుగా పత్తికొండలో బీసీ బాలికల వసతి గృహం  ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు , ఎన్ని వినతి పత్రాలు అందించిన అధికారులు పట్టించుకోవడంలేదని వారు వాపోయారు. బీసీ బాలికల వసతి గృహం లేకపోవడం వలన బాలికలు చదువులకు దూరమయ్యే అవకాశం ఉందని అన్నారు. బీసీ బాలికల వసతి గృహం ఏర్పాటు చేస్తామని ఆమె ఇచ్చి, అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యేలు మారుతున్నారే తప్ప బీసీ హాస్టల్ నిర్మించడంలో విఫలం అయ్యారని తెలిపారు. ఇప్పటికైనా తక్షణమే బీసీ బాలికల వసతి గృహాన్ని పత్తికొండ పట్టణంలో ఏర్పాటు చేయాలని, అధికారులు మొద్దు నిద్ర వీడి విద్యార్థి సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా బీసీ బాలికల వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని అఖిల భారత విద్యార్థి యువజన సంఘాలు డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. లేని పక్షంలో విద్యార్థులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

About Author