NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రగ్బీ  పోటీలను  ప్రారంభించిన డాక్టర్. శంకర్ శర్మ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో పాల్గొంటే మంచి భవిష్యత్తు ఉంటుందని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ అన్నారు. రగ్బీ  పోటీలను అవుట్ డోర్ స్టేడియంలో డాక్టర్. శంకర్ శర్మ ప్రారంభించారు. ఉమెన్ రగ్బీ వరల్డ్ కప్ పోటీల సందర్భంగా రగ్బీ క్రీడ పై అవగాహన కల్పించేందుకు రగ్బీ ఇండియా అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలికలకు మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చారు. శిక్షణ అనంతరం శనివారం పోటీలు నిర్వహించారు.  ఈకార్యక్రమంలో డాక్టర్. శంకర్ శర్మ క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించి మాట్లాడుతూ కర్నూలు అంటే క్రీడలు క్రీడలంటే కర్నూలు గా గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్యార్థులు భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కునే ధైర్యం వస్తుందన్నారు. అందుకే కర్నూలులో తనవంతుగా విద్యార్థులను క్రీడల్లో రాణించే విధంగా ప్రోత్సాహం చేస్తున్నానని డాక్టర్. శంకర్ శర్మ వివరించారు. ప్రస్తుతం ఊబకాయం, సెల్ ఫోన్ వాడకంతో మనవాళి మనుగడకు ముప్పుగా మారిందని సెల్ ఫోన్ వాడకం తగ్గించి మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో క్రీడాప్రతినిధులు రామాంజనేయులు, మహాబూబ్ సుభాన్,యండీ. బాష బాలాజీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *