కర్నూలు చిత్తారి వీధి 07వ వార్డులో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: నగరంలోని చిత్తారి వీధి 07వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి శ్రీమతి సుశీల గారు, కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి మదుగుండు వరలక్ష్మి తరఫున నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు, కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ ఎస్వీ మోహన్ రెడ్డి , మాజీ ఎంపీ శ్రీమతి బుట్టా రేణుక పాల్గొన్నారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలతో కలిసి వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలను నేరుగా కలుసుకుంటూ కార్పొరేటర్ అభ్యర్థి మదుగుండు వరలక్ష్మి ని పరిచయం చేస్తూ, ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగించారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


