డ్రంకెన్ డ్రైవ్ … ఓపెన్ డ్రింకింగ్ తనిఖీలు
1 min read
తనిఖీలు చేపట్టిన … కర్నూల్ మూడవ పట్టణ పోలీసులు.
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూల్ జిల్లా ఇంచార్జి ఎస్పీ శ్రీ అది రాజ్ సింగ్ రాణా ఐపీఎస్ ఆదేశాల మేరకు కర్నూల్ మూడవ పట్టణ పోలీసులు సోమవారం రాత్రి డ్రంకెన్ డ్రైవ్ , ఒపెన్ డ్రింకింగ్ తనిఖీలు నిర్వహించారు. డ్రంకెన్ డ్రైవ్ లో 4 గురు పట్టుబడ్డారు. వీరందరి పై కేసులు నమోదు చేసి కోర్టులో హజరు పరిచారు. కర్నూలు జెఎఫ్ సి ఎం కోర్టు వారు ఒక్కొక్కరి పై రూ. 10 వేల జరిమానా విధించారు.బహిరంగప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజా శాంతికి భంగం కలిగించిన 4 గురి పై ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేశారు. కర్నూలు జె ఎఫ్ సి ఎం కోర్టు వారు ఒక్కొక్కరిపై రూ. 1000 జరిమానా విధించారు.