భూమికి గొడుగు – ఓజోన్ అడుగు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏ-క్యాంపు మాంటిస్సోరి పాఠశాలనందు ఓజోన్ పొర రక్షణ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విశ్రాంత అడవి ఉప సంరక్షణాధికారి శ్రీ జయచంద్రారెడ్డి పాల్గొన్నారు.విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… భూమిపై సమస్త జీవకోటికి ఓజోన్ పొర రక్షణ కవచమని దాని క్షీణతను అరికట్టడానికి ప్లాస్టిక్, రసాయనాల వినియోగాలు తగ్గించటమే కాక ఎక్కువ సంఖ్యలో చెట్లు నాటాలని పిలుపునిచ్చారు. ఈ అవగాహన కార్యక్రమాలలో భాగంగా 100 మంది విద్యార్థులు కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీలో పాల్గొన్నారు. 500 మంది పైగా విద్యార్థులు ఓజోన్ రక్షణ నినాదాల రచన, చిత్ర లేఖనం, క్విజ్ పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయిని, సమన్వయ కర్తలు, సైన్స్ ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.



