సేవా పథంలో విద్యా దాత..డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు
1 min read

తన పుట్టినరోజు వేడుకలను నిరాడంబరంగా జరుపుకొని… సమాజం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు అమలు..
అన్నదాత సుఖీభవ అంటూ అనాధ ఆశ్రయాలకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు…
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పి4 పథకం కింద పలువురి అభివృద్ధికి దత్తత…
కర్నూలు న్యూస్ నేడు: ప్రముఖ విద్యావేత్త, డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు కర్నూలులో కేవీ సుబ్బారెడ్డి కళాశాలలో… వైభవంగా జరిగాయి. ఆయన తన జన్మదినాన కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పలు సామాజిక, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం విశేషం. నిరాడంబరంగా వేడుకలు – విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగానే తను 70 వ ఏటా అడుగుపెడుతూ సమాజసేవకే కృషి చేస్తానంటున్నారు. ఇందులో ముఖ్యంగా ఉల్చాల రోడ్డు వీకర్ సెక్షన్ కాలనీ యందు వీరాంజనేయ స్వామి ఆలయానికి లక్ష 116 లు విరాళంగా ఇచ్చారు. అలాగే ధూపాడలోని శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయానికి రంగులు వేయడానికి సుమారు మూడు లక్షల రూపాయలను అందించామన్నారు. భవిష్యత్తులో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మరిన్ని మెరుగైన సాంకేతిక విద్యా వసతులు కల్పించడమే మా లక్ష్యం” అని పేర్కొన్నారు. జన్మదినం సందర్భంగా జిల్లాలోని రాజకీయ ప్రముఖులు, విద్యావేత్తలు మరియు వివిధ సంఘాల నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. నిరంతరం విద్యాభివృద్ధికి కృషి చేస్తూ, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ఆయన మరిన్నిపుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

