NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీబీ-ముక్త్ భారత్ అభియాన్ అవగాహన సదస్సు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: కర్నూలు మెడికల్ కాలేజీ న్యూ లెక్చర్ గ్యాలరీ లో జరిగిన టీబీ-ముక్త్ భారత్ అభియాన్ అవగాహన సదస్సు లో పాల్గొన్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కె. వెంకటేశ్వర్లు .ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డా. కె. వెంకటేశ్వర్లు  మాట్లాడుతూ 2025 నాటికి క్షయ రహిత దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘టీబీ-ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకగా అమలు చేస్తున్నాయని అన్నారు.క్షయ వ్యాధి పట్ల ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించి సరైన చికిత్స అందించడం ద్వారా మరణాల రేటును పూర్తిగా తగ్గించవచ్చు అన్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీబీ రోగులకు ఉచిత వైద్యంతో పాటు, వారి పౌష్టికాహారాన్నీ బాధితులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రూ. వెంకటేశ్వర్లు తో పాటు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ చిట్టినరసమ్మ  మరియు డా. భాస్కర్ (డిస్ట్రిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ) డా. జఫ్రుల్లా ( డిస్ట్రిక్ కోఆర్డినేటర్ హెల్త్ సర్వీసెస్ ) మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

About Author