కర్నూల్ మెడికల్ కాలేజీకి అరుదైన గౌరవం..
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: సర్టిఫికెట్ ఆఫ్ హానర్స్” అందించిన జిప్మర్…. వివిధ దేశాల “అంతర్జాతీయ మెడికల్ సదస్సులో కేఎంసి విద్యార్థుల ప్రతిభ”. పుదుచ్చేరి రాష్ట్రంలోని జిప్మర్ వైద్య కళాశాలలో నిర్వహిస్తున్న వివిధ దేశాల అంతర్జాతీయ యూజీ వైద్య విద్యార్థుల వైద్య సదస్సు “కొయిసైన్సెస్ 8.0(ఓ)” మార్చి 13,14,15 తేదీలలో పుదుచ్చేరి లో నిర్వహించడం జరిగింది. ఈ అంతర్జాతీయ సదస్సులో 13 స్థాయిలలో జరిగిన అత్యంత కఠినమైన డిబేట్ పోటీలలో ఫైనల్ రౌండ్ కు రష్యా, జార్జియా, ఎయిమ్స్ ఢిల్లీ, పుదుచ్చేరి జిప్మర్, కర్నూల్ మెడికల్ కాలేజ్ విద్యార్థులు ఎంపిక కావడం జరిగింది. హోరాహోరీగా జరిగిన అంతర్జాతీయ స్థాయిలో ఫైనల్ రౌండ్ లో కర్నూల్ మెడికల్ కాలేజీ విద్యార్ధి ఫైనల్ సంవత్సరం విద్యార్ధి “ఏ.కార్తీక్” ప్రథమ స్థానం సాధించడం జరిగింది. ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రథమ స్థానం సాధించి కర్నూలు మెడికల్ కాలేజీకి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన కార్తీక్ గతం లో కూడా జాతీయ స్థాయి వైద్య సదస్సులో కేస్ ప్రజెంటేషన్ లో ప్రథమ స్థానం లో రావడం ఇలా కేయంసి విద్యార్థి జాతీయ స్థాయిలో అద్భుత విజయాలు సాధిస్తుండటం పట్ల అడిషనల్ డీఎంఈ & మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కే చిట్టి నరసమ్మ ప్రత్యేకంగా అభినందించారు.ఈ విజయం సాధించడం వల్ల కర్నూలు మెడికల్ కాలేజీకి ఒక అరుదైన గౌరవం కూడా దక్కింది. గత ఎనిమిదేళ్లుగా నిర్వహిస్తున్న ఈ సదస్సు చరిత్రలో తొలిసారిగా ఈ గౌరవం కర్నూలు మెడికల్ కాలేజీకి దక్కడం విశేషం.ఈ సదస్సుకు కర్నూలు మెడికల్ కాలేజీ నుండి మొత్తం ఏడుగురు విద్యార్థులు — మనోగ్నా రెడ్డి, కిల్లి కావ్య, హరిత రెడ్డి, జీవి వెంకట కార్తీక్ సాయి, అజయ్ సాయి, శబరీష్ తదితరులు — హాజరై, డిబేట్‌తో పాటు క్విజ్, వర్క్‌షాప్స్, సింపోజియంలలో చురుకుగా పాల్గొన్నారు.

