NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజారోగ్య పరిరక్షణకు కృషి..ఆళ్ల నాని

1 min read

15లక్షల, 51వేలరూపాయల  సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులు అందచేత..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : ప్రజారోగ్య పరిరక్షణకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సిపి ఏలూరు జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆళ్ల నాని పేర్కొన్నారు. ఏలూరు నియోజకవర్గం పరిధిలో వివిధ డివిజన్లకు చెందిన పలువురు లబ్ధిదారులకు 15 లక్షల 51 వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యంగా పటిష్ట కార్యాచరణ అమలు చేస్తున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలందరికీ కార్పొరేట్ తరహా వైద్యం అందించడంతోపాటు, ఆరోగ్య ఆసరా ద్వారా చికిత్సానంతర జీవన భృతిని సైతం అందిస్తున్నామని అన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలో లేని వ్యాధులకు చికిత్స చేయించుకున్న వారికి సైతం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సహాయం అందిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా తమకు సీఎంఆర్ఎఫ్ నుంచి నిధులు గుమంజూరు చేయించిన ఆళ్ళ నాని కి సదరు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నూకపోయే సుధీర్ బాబు, మెడికల్ బోర్డు మెంబర్  డాక్టర్ వరప్రసాద్, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవి, మాజీ ఏఎంసీ  చైర్మన్ మంచం మై బాబు, కార్పొరేటర్లు, సుంకర చంద్ర శేఖర్, కోఆప్షన్ సభ్యులు మున్నుల జాన్ గురునాథ్, దితరులు పాల్గొన్నారు.

About Author