NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చిన్నారుల ప్రాణ రక్షణలో అత్యవసర-అధునాతన వైద్య నైపుణ్యాలదే కీలక పాత్ర

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  అడిషనల్ డిఎమ్ఈ & మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె చిట్టి నరసమ్మ… “కేఎంసీ లో పీడియాట్రిక్ వైద్యులకు అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ స్కిల్స్ పై (ALS )శిక్షణ”……..,……….పిల్లల్లో తలెత్తే అత్యవసర వైద్య పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని, వారి ప్రాణాలను కాపాడటంలో పీడియాట్రిక్ వైద్యులకు అధునాతన వైద్య నైపుణ్యాలు ఎంతో అవసరమని  అదనపు డీఎంఈ, కర్నూల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె. చిట్టి నరసమ్మ పేర్కొన్నారు. శనివారం నాడు  కర్నూల్ మెడికల్ కాలేజీ యందు స్కిల్ డెవలపెంట్ ల్యాబ్ యందు కేయంసి పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ మరియు ఐఏపి లు కలిసి పీడియాట్రిక్ వైద్యులకు  పీజీలకు నిర్వహిస్తున్న రెండు రోజుల  “పిడియాట్రిక్ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ స్కిల్స్” పై శిక్షణా కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కర్నూలు మెడికల్ కాలేజీలో స్కిల్స్ డెవలప్మెంట్, వైద్య పరిశోధనలకు, ఇన్నోవేషన్లకు పూర్తి సహకారం అందిస్తామని ఆమె తెలిపారు. అడిషనల్ డిఎమ్ఈ హాస్పిటల్ సూపరెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హాస్పిటల్ లో పీడియాట్రిక్ విభాగానికి నాలుగైదు జిల్లాల నుంచి పిడియాట్రిక్ అత్యవసర కేసులు వస్తుంటాయని  కావున  ఈ శిక్షణ పీడియాట్రిక్ వైద్యులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ సుహాసిని, అనస్థీయా ప్రొఫెసర్ డాక్టర్ రామ్ శివ నాయక్, వివిధ కాలేజీల పీడియాట్రిక్ వైద్యులు పీజీ వైద్యులు అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *