నిత్యావసర వస్తువులను రేషన్ దుకాణాల ద్వారా సబ్సిడీపై అందించాలి
1 min read
పెంచిన ధరలను తగ్గించాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా.ప్రభాకర్
సిపిఐ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వర రావు
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ)ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని ఏలూరు అర్బన్ మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించి తహసిల్దార్ కి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యావసర వస్తువుల ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల తహసిల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించి వినతి పత్రాలు ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. నరేంద్ర మోడీ ఎన్నికల సమయంలో ఆకాశంలో ఉన్న నిత్యావసర వస్తువుల ధరలను నేలకు దించి సామాన్యునికి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చి 12 ఏళ్లు గడిచినప్పటికీ ధరలను తగ్గించకపోగా రకరకాల కారణాలతో విపరీతంగా పెంచుతున్నారని ఆరోపించారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు ఎదుర్కొంటున్న అధిక ధరల బారాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏఐటియుసి ఏలూరు జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు,ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ సహాయ కార్యదర్శి కురెళ్ళ వరప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు సరైన ఉపాధి కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని విమర్శించారు. అధిక ధరలు వలన ప్రజలు ఆర్థికంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా కార్యవర్గ సభ్యులు మావూరి విజయ,జి.స్వాతి, బళ్ల కనకదుర్గారావు, ఉప్పులూరి లక్ష్మి, భవాని, రేఖ, ఎం.సత్యవతి, బాలిన ప్రసాద్,జిజ్జి వరపు సురేంద్ర, అమర్, కె.సురేష్, ఎస్.సోమేశ్వరరావు, వై.శ్రీనివాసు, ఎం.మహేష్, జి.ఈశ్వరరావు,సాయి,జి. అప్పారావు,తదితరులు పాల్గొన్నారు.


