NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రతి ఉద్యోగి తన పనితీరుతో ఇతరులకు ఆదర్శంగా నిలవాలి

1 min read

సమాచార శాఖ జోన్-2 ప్రాంతీయ సంయుక్త సంచాలకులు పి.తిమ్మప్ప

జిల్లా సమాచార పౌర సంబంధాల  కార్యాలయాన్ని సందర్శించి సిబ్బంది పనితీరుపై సమీక్షించా

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:ప్రతీ ఉద్యోగి తన పనితీరుతో ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సమాచార శాఖ జోన్-2 ప్రాంతీయ సంయుక్త సంచాలకులు  పి.తిమ్మప్ప చెప్పారు. స్థానిక జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయాన్ని శనివారం తిమ్మప్ప సందర్శించి కార్యాలయ సిబ్బంది పనితీరును  సమీక్షించారు. ఈ సందర్భంగా తిమ్మప్ప మాట్లాడుతూ సమాచార శాఖ  ప్రభుత్వానికి ప్రజలకు  వారధి లాంటిదని,  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసి వాటిపై ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేస్తుందన్నారు. అంతటి బృహత్తరమైన విధులను నిర్వర్తించే సమాచార శాఖ సిబ్బంది తమ పనితీరుతో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు.  సిబ్బంది అందరూ విధి నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనపరచి  ఒక టీం వర్క్ తో సమాచార శాఖ ప్రతిష్టను మరింత ఇనుమడింప చేయాలన్నారు.  ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించి,  అర్హులైన మరింత మంది పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయాలన్నారు.  ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై లబ్ధిదారుల అభిప్రాయాలను తెలుసుకుని విజయగాధల రూపంలో సమర్పించాలన్నారు.  సిబ్బంది ప్రతీ ఒక్కరిని తమ  సమస్యలను అడిగి  తెలుసుకున్నారు.  సిబ్బంది తెలియజేసిన సమస్యలను పరిష్కారానికి కృషిచేస్తానని తిమ్మప్ప చెప్పారు.జిల్లా సమాచార పౌర సంబంధాధికారి యూ. సురేంద్రనాథ్,డివిజినల్ పిఆర్ఓ సిహెచ్. దుర్గాప్రసాద్, సిబ్బంది సిహెచ్. శ్రీనివాస్ నెహ్రు, లక్ష్మి, సౌరిప్రసాద్,బాబురావు,సాగర్, గంగాధర్, సంధ్య,మల్లిబాబు, రత్నం, రామారావు,నరసింహం, రిటైర్డ్  డిపిఆర్ఓ ఐ.కాశయ్య, ప్రభృతులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *