బాల్య వివాహాల నివారణకు ప్రతి ఒక్కరు తమవంతుగా సహకరించాలి
1 min read
కర్నూలు , న్యూస్ నేడు: పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హవానపేట ,ఆదోని లొ జరుగుచున్న ఆశా సమావేశం నందు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ వై నాగ ప్రసాద్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు సరియైన వివాహ వయస్సు మరియు యుక్త వయస్సు లో గర్భదారణ వల్ల వచ్చే అనర్థాలు అనే విషయాలపై వివరంగా తెలియచేసారు. అమ్మాయిలకు 18 సం II మరియు అబ్బాయిలకు 21 సం II తరువాత మాత్రమే వివాహాలు చేయాలని అప్పుడే వారు శారీరకంగా మరియు మరియు మానసికంగా అర్హులై ఉంటారని , లేనిచో యుక్త వయస్సు నందు గర్భదారణ ( టీనేజ్ ప్రేగ్నేన్సి ) వల్ల గర్భస్రావం , మృత శిశు జననం,బరువు తక్కువ పిల్లలు పుట్టడం , తల్లి కి తీవ్ర రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశమున్నదని తెలిపారు. .అంతేకాకుండా బాల్య వివాహాల జరుగకుండా ప్రతి ఒక్కరు తమవంతుగా సహకరించాలని పిలుపునిచ్చారు. తదుపరి డిఎంహెచ్ఓ డాక్టర్ సత్య వతి మాట్లాడుతూ కిషోర బాల భాలికలలో పెరుగుదల త్వరితంగా ఉండునని కావున వారు ఐరన్ మరియు క్యాల్సియం అదికంగా ఉన్న పాలు , ఆకుకూరలు , కూరగాయలు, గ్రుడ్డు మొదలైనవి విరివిగా తీసుకోవాలని , అంతేకాకుండా రక్తహీనత నివారణ కొరకు వారానికి ఒక సారి ప్రతి గురువారం ఐరన్ మాత్ర వేసుకోవాలని ఈ విషయాలు పై ఆశా కార్యకర్తలు అవగాహన కల్పించాలని తెలిపారు.ఈ కార్యక్రమం లో డెమో శ్రీనివాసులు , డిప్యూటీ డెమో చంద్రశేఖర రెడ్డి, మానిట రింగ్ కన్సల్టెంట్ సుమలత, సూ పర్ వైజర్ మేరీ అరుణ ,ఆరోగ్య కార్యకర్త లు , ఆశా కార్యకర్తల పాల్గొన్నారు.