NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాజీ సైనికులకు.. లీగల్ సర్వీసెస్ క్లినిక్   

1 min read

 – జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి  జి. కబర్థి

కర్నూలు, న్యూస్​ నేడు:రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి  జి. కబర్థి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, కార్యదర్శి  గారైన  బి. లీలా వెంకట శేషాద్రి  15-08-2025 శుక్రవారం నాడు సి క్యాంపు నందు గల జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ నందు మాజీ సైనికుల కొరకు నల్సా వీర్ పరివార్ సహాయత యోజన 2025  లో భాగంగా లీగల్ సర్వీసెస్ క్లినిక్ ను ప్రారంభించారు.  జిల్లా జడ్జి మాట్లడుతూ ఈ క్లినిక్ నందు న్యాయ వాది మరియు ప్యారా లీగల్ వాలంటీర్ లు ఉంటారని వీరు మాజీ సైనికుల కు చట్టభద్ధ మైన సమస్య లు ఉంటే వాటికీ ఉచితంగా న్యాయాన్ని అందించి వారి సమస్య లను పరిష్కరిస్తారని తెలిపారు.  లీలా వెంకట శేషాద్రి మాట్లడుతూ మాజీ సైనికులు అందరు ఉచిత న్యాయ సహాయానికి అర్హులని తెలిపారు. ఈ సదస్సు లో  కర్నూలు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్  ఎస్. ఆర్. రత్న రూత్, న్యాయవాది హేమలత రెడ్డి, ప్యారా లీగల్ వాలంటీర్ మధు సుధన్,మాజీ సైనిక ఉద్యోగులు పాల్గొన్నారు.

About Author