NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సండేల్​ చంద్ర శేఖర్​ కు సన్మానం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:స్వాతంత్ర్య సమర యోధులలో ఒకరైన ఎస్​.డి. నారాయణ రావు కుమారుడు సండేల్​ చంద్ర శేఖర్​ కు శుక్రవారం 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వాణిజ్య, ఫుడ్​, పరిశ్రమల శాఖ మంత్రి టి.జి. భరత్​ , కలెక్టర్​ రంజిత్​ బాషా, ఎస్పీ విక్రాంత్​ పటేల్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సండేల్​ చంద్ర శేఖర్​ మాట్లాడుతూ తన తండ్రి  ఎస్​.డి. నారాయణ తొమ్మిదేళ్ల వయస్సు నుంచి పోరాట యోధులతో తిరిగే వాడని, ఇంటి నుంచి బయటకు వెళ్లి క్విట్​ ఇండియా, విదేశీ వస్తువుల బహిష్కరణ తదితర  ఉద్యమాలు చేశారని గుర్తు చేసుకున్నారు. దక్షిణ కేంద్రం  కర్ణాటకలోని మూడు బిద్ర తాలూకాలోని  సండేల్​ గ్రామంలో తన తండ్రి జన్మించారని, స్వాతంత్ర్య పోరాటంలో  పాల్గొనే సమయంలోనే సండేల్​ అనే గ్రామం పేరు … ఇంటి పేరుగా ప్రజలు పిలిచారని, అప్పటి నుంచి సండేల్​ నారాయణ రావుగా  మారిందన్నారు.  79వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబాలను సన్మానించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సండేల్​ చంద్ర శేఖర్​ తెలిపారు.

About Author