NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ మఠానికి రూ. లక్ష విరాళం

1 min read

 మంత్రాలయం, న్యూస్​ నేడు:  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి  బెంగళూరుకు చెందిన మంజునాథ్ అనే భక్తుడు  రూ. లక్ష రూపాయల విరాళంగా ఇచ్చినట్లు మఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు.  శ్రీ మఠం లో జరిగే సంపూర్ణ సేవా కొరకు వినియోగిస్తున్నట్లు మేనేజర్ తెలిపారు. లక్షలాది మంది భక్తుల మధ్య శ్రీ మంత్రాలయం రాఘవేంద్ర స్వామి 354వ ఆరాధనోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయని, ఇందుకు సహకరించిన భక్తులకు , అధికారులకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

About Author