NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

థియేట‌ర్ ధ్వంసం చేసిన ఫ్యాన్స్ !

1 min read

Empty red armchairs of a theater ready for a show

ప‌ల్లెవెలుగువెబ్ : ఓ హీరో అభిమానుల అభిమానం హ‌ద్దు మీరింది. దాని ఫ‌లితంగా ఓ థియేట‌ర్ ధ్వంస‌మైంది. ‘బీస్ట్‌’ చిత్రం ట్రైలర్‌ను తిలకించిన ఆనందంలో హీరో విజయ్‌ అభిమానులు ఒక థియేటర్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటన త‌మిళ‌నాడులోని తిరునెల్వేలిలోని రామ్‌ థియేటర్‌లో జరిగింది. హాలులోని కుర్చీలతో పాటు థియేటర్‌ అద్దాలను పగులగొట్టారు. దీంతో ఆ ధియేటర్‌కు అపారనష్టం వాటిల్లింది. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్ర ట్రైలర్‌ను శనివారం సాయంత్రం సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. అభిమానుల కోసం రాష్ట్రంలో ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో ప్రత్యేకంగా శాటిలైట్‌ ద్వారా ట్రైలర్‌ ప్రసారం చేశారు. మరికొన్ని థియేటర్ల వద్ద భారీ స్ర్కీన్లు ఏర్పాటు చేసి ప్రదర్శించారు.

                                          

About Author