NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

23న FAPTO ధర్నా

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: సీపీఎస్​ రద్దు, డీఏ, పీఆర్​సీల మంజూరు తదితర డిమాండ్ల సాధన కోసం ఈ నెల 23న ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు FAPTO రాష్ట్ర కార్యదర్శి కె.ప్రకాష్ రావు, APJAC సెక్రటరీ జెనెరల్ జి. హృదయ రాజు, FAPTO కర్నూలు జిల్లా చైర్మన్ జె.సుధాకర్, జిల్లా సెక్రటరీ జెనెరల్ పి రంగన్న , జిల్లా ఫైనాన్స్ సెక్రెటరీ సెవ్యా నాయక్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర FAPTO పిలుపు మేరకు కర్నూలు జిల్లా కేంద్రంలోని శ్రీ కృష్ణ దేవరాయ ధర్నా చౌక్​లో చేపడుతున్న ధర్నాలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అదేవిధంగా తాలూకా కేంద్రాల్లో జరిగే దీక్ష శిబిరాల్లో విరివిగా పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. ధర్నాకు APJAC, APCPSUS, APCPSEA, TNUS మద్దతు ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.

About Author