NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీవీ మెకానిక్ షాపులో అగ్నిప్రమాదం.. రూ.50 వేల నష్టం

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని యూనియన్ బ్యాంక్ ఎదురుగా ఉన్న టీవీ మెకానిక్ షాపులో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో షాపులోని టీవీలు, డిష్ వైర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిబూడిదయ్యాయి.డిష్ ఆంజనేయులు టీవీ మెకానిక్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. మరమ్మతుల కోసం వినియోగదారులు ఇచ్చిన టీవీలతో పాటు షాపులోని ఇతర సామగ్రి అగ్నికి ఆహుతైనట్లు బాధితుడు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు షాపుకు నిప్పు పెట్టి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.అగ్నిప్రమాదం గురించి స్థానికులు డోన్ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోపే స్థానికులు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే షాపులోని ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయాయి.ఈ ప్రమాదంలో సుమారు రూ.50 వేల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని ఆయన కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *