NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఫిష్ ఫెస్టివల్ పోస్టర్లు విడుదల…

1 min read

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు : రాయలసీమ జిల్లాలైన కడప ,కర్నూల్, నంద్యాల ,అనంతపురం సత్య సాయి, అన్నమయ్య జిల్లాలకు ముఖ ద్వారం అయినా కర్నూలు పట్టణంలోని రావూరి గార్డెన్ ముందు మత్స్యశాఖ, అలాగే ఆర్గానిక్ వారు సంయుక్తంగా ఫ్రాన్స్, అలాగే ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను ఈనెల అనగా నవంబర్ 3,4,5 తేదీలలో నిర్వహిస్తున్నట్లు మంగళవారం ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ విలేకరులకు తెలిపారు, ఈ సందర్భంగా ఆయన ఎంపీపీ కార్యాలయం నందు, ఎంపీడీవో సుబ్రమణ్యం శర్మ తో కలిసి పోస్టర్లను లాంఛనంగా విడుదల చేశారు, ఈ సందర్భంగా గ్రామం మత్స్యకార సహాయకులు మస్తానమ్మ మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి అందరూ  ఆహ్వానితులేనని ఈ ఫిష్ ఫెస్టివల్ నందు మంచినీటి, సముద్రపు చేపల రుచికరమైన వంటకాలతో కూడిన అపరిమిత భోజనము కేవలం 339 రూపాయలకి అందించడం జరుగుతుందన్నారు, మాంసాహార ప్రియులందరూ తప్పక పాల్గొని ఈ కార్యక్రమంలో జయప్రదం చేయవలసిందిగా ఆమె కోరారు ఈ కార్య క్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు అల్లి శ్రీరామమూర్తి, ఎంపీటీసీ నిరంజన్ రెడ్డి, రజక కమిటీ డైరెక్టర్ డాక్టర్ పిచ్చయ్య, కుమార్ రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు టి ఎన్ చంద్ర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

About Author