స్కూల్ బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరిగా ఉండాలి
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: స్కూల్ బస్సులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగినది డోన్ నగరంలోని రెండు స్కూళ్లకు సంబంధించిన బస్సులకు ఇన్సూరెన్స్ లు ఎక్స్పైర్ అయినట్టు గుర్తించి కేసులు నమోదు చేసినట్లు డోన్ మోటారు వాహనముల తనిఖీ అధికారి టీ. క్రాంతి కుమార్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అలాగే బస్సులలో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే మంటలను అదుపు చేయడానికి ఎలాంటి ఫైర్ ఎస్టింగిషర్ లేనందువలన వాటికి కూడా జరిమానా విధించామన్నారు. డోన్, బేతంచెర్ల మరియు ప్యాపిలి మండలములలో తిరుగుతున్నటువంటి స్కూల్ బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరిగా ఉండవలెను అలాగే వాహనాలకు సంబంధించిన అన్ని ధ్రువపత్రములు ఉండవలెను స్కూల్ బస్సు డ్రైవర్ కు 60 సంవత్సరాలకు మించి వయస్సు ఉండకూడదని, చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించాడు.


