NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ విద్య బలోపేతం కోసం ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత ఉంది

1 min read

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం

ఇకపై విద్యార్థుల అభ్యసన ఫలితాలపై దృష్టిపెడతాం

ఉండవల్లి నివాసంలో ‘షైనింగ్ టీచర్’ ను ఘనంగా సత్కరించిన మంత్రి లోకేష్

విద్యార్థిగా మారి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సలహాలు, సూచనలు స్వీకరణ

పత్తికొండ, న్యూస్​ నేడు : ప్రభుత్వ విద్య బలోపేతం కోసం ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత ఉందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సైనింగ్ టీచర్ పేరున తమ ఉపాధ్యాయిని కళ్యాణి కుమారిని ఉండవల్లిలో సత్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యాశాఖలో మొదటి ఏడాది సంస్కరణలు పూర్తయ్యాయని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. ఇకపై విద్యార్థుల అభ్యసన ఫలితాలపై దృషిసారిస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం మారుమూల గిరిజన గ్రామం జేఎం తండాలోని ప్రభుత్వ ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలో వృత్తిపట్ల అంకింతభావం చూపి అద్భుత ఫలితాలు సాధిస్తున్న ఉపాధ్యాయురాలు శ్రీమతి ఎం.కల్యాణి కుమారిని కుటుంబంతో సహా ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని మంత్రి నారా లోకేష్ ‘షైనింగ్ టీచర్’ పేరుతో ఘనంగా సత్కరించారు. ఈ నేపథ్యంలో ఉత్తమ ఉపాధ్యాయుని కళ్యాణి కుమారి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది ఉపాధ్యాయ లోకానికి ఆదర్శంగా నిలిచారు.2017లో జేఎం తండా మండల పరిషత్ ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలకు బదిలీ అయిన ఉపాధ్యాయురాలు కల్యాణి తన అంకితభావంతో పాఠశాల రూపురేఖలు మార్చి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దారు.

About Author