మహానంది లో ఫారెస్ట్ డైరెక్టర్ పూజలు
1 min read

మహానంది, న్యూస్ నేడు: మహానంది పుణ్యక్షేత్రం లో నాగార్జున సాగర్ అభయ ఆర్న్య ఫారెస్ట్ డైరెక్టర్ విజయకుమార్ పూజలు నిర్వహించారు. గురువారం స్వామివారి దర్శనానికి వచ్చిన వారికి స్థానిక డిప్యూటీ రేయింజ్ అధికారి హైమావతి స్వాగతం పలికారు. అనంతరం శ్రీకామేశ్వరీ దేవి సహిత మహానందీశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆనవాయితి ప్రకారం కళ్యాణ మండపంలో వేదపండితులు రవిశంకర్ అవధాని వేదమంత్రోచ్చారణ మధ్య దేవస్థానం సూపర్డెంట్ శశిధర్ రెడ్డి కండువా కప్పి స్వామివార్ల ప్రసాదాన్ని అందజేశారు. వారివెంట రేయింజ్ అధికారులు నాజిర్ జా, ఉదయ్ దీప్, తదితరులు వున్నారు.

