NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అడవుల సంరక్షణ అందరి బాధ్యత… ఎఫ్ డి విజయ్ కుమార్

1 min read

మహానంది, న్యూస్​ నేడు: అడవులను రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని  నాగార్జున సాగర్ అభయ అర్ణ్య విల్డ్ లైఫ్ ఫారెస్ట్ శాఖ ఫీల్డ్ డైరెక్టర్ విజయ్ కుమార్ అన్నారు. గురువారం మహానంది లోని అటవీ పర్యావరణ కేంద్రాన్ని ఫిల్డ్ డైరెక్టర్ పునప్రారంభించారు. గతంలో స్థానికులతో పాటు మహానంది కి వచ్చే భక్తులకు అడవులపై, అడవిజంతువులపై అవగాహన కల్పించే విదంగా రూపొందించిన చిత్రీకరణల ను ఏర్పాటు చేశారు. అయితే నిధుల కొరత వల్ల గత కొన్ని సంవత్సరాలుగా మూతపడింది. విషయం తెలుసుకున్న ఆయాన ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక చొరవతో పునప్రారంభం చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నల్లమలలో ప్రస్తుతం 87 పెద్ద పులులు వున్నట్లు తెలిపారు. త్వరలో పులుల లెక్కింపు ప్రారంభిస్తామన్నారు. ఆయుధాలపై శిక్షణ ఇస్తామన్నారు. సిబ్బంది కొరత వుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల డివిజనల్ ఫారెస్ట్ అధికారి అనురాగ్ మీనా, నంద్యాల, చలమ రేయింజ్ అధికారులు నాజిర్ జా, ఉదయ్ దీప్, మహానంది డి ఆర్ ఓ హైమావతి, తదితరులు వున్నారు.

About Author