గ్రంధాలయంలో ఉచిత వేసవి విజ్ఞాన శిబిరాలు
1 min read
ఏప్రిల్ 28 నుండి జూన్ 6వతేదీ వరకు ..గ్రంథాలయ అధికారి దుగ్గిపోగు జాన్ బాబు
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ : పెదపాడు శాఖా గ్రంధాలయం నందు ఏప్రిల్ నెల ఏప్రిల్ 28సోమవారం నుండి జూన్ 6 తేదీ శుక్రవారం వరకు ఉచిత వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ అధికారి దుగ్గిపోగు జాన్ బాబు తెలియపరిచినారు. ఈ కార్యక్రమములు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహణ జరుగును ఈ శిబిరంలో విద్యార్థిని విద్యార్థులకు బాలసాహిత్యం, కథలు వినడం,కథలు చెప్పడం, కథలు చదివించడం,పుస్తక సమీక్ష ,చిత్రలేఖనం, చదరంగం,క్యారమ్స్ ,క్విజ్,జీకే మొదలగు అంశాలను బాలలు నేర్చుకోవచ్చును అని తెలియపరిచినారు. తల్లిదండ్రులు మీ పిల్లలను తప్పనిసరిగా గ్రంథాలయమునకు పంపించి మంచి విజ్ఞానవంతులుగా తయారు చేయవలసిందిగా విజ్ఞప్తి చేసినారు.