జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి…
1 min read
ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలి సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్
బి. గిడ్డయ్య డిమాండ్
కర్నూలు, న్యూస్ నేడు: భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కర్నూల్ నగర సమితి సమావేశం స్థానిక చండ్ర రాజేశ్వరరావు భవనం నందు సిపిఐ నగర సహాయ కార్యదర్శి సి మహేష్ అధ్యక్షతన జరిగినది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ బి. గిడ్డయ్య సీనియర్ నాయకులు కామ్రేడ్ జగన్నాథం పాల్గొని వారు మాట్లాడుతూజిల్లాలో వేదవతి గుండ్రేవుల గురు రాఘవేంద్ర ప్రాజెక్టులకు నిధులు కేటాయిoచి ప్రాజెక్టులను పూర్తి చేసి కర్నూలు జిల్లాలో ఆదుకోవాలని కర్నూలు నగరానికి శాశ్వతంగా త్రాగునీటి సమస్య లేకుండా చూడాలనికర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమంతా పూర్తిగా ఎడారిగా మారకముందే ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇప్పటికే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నేత రకాల ఆందోళన చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు జిల్లాను పూర్తిగా విస్మరించడం స్థానిక ఎమ్మెల్యే కు ఏమైనా ప్రజల పైన ప్రేమ అభిమానం ఉంటే మీ ప్రాంతంలోని ప్రాజెక్టులకు నిధులు తీసుకురావాలని దాని ద్వారా ప్రాజెక్టులు పూర్తయితే రైతుల కు త్రాగునీరు సాగునీటీ ఇబ్బందులు లేకుండా పంటలు పండించుకుని మెరుగైన జీవితం గడపడానికి వీలుంటుందని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. పి రామకృష్ణారెడ్డి నగర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావునగర కార్యవర్గ సభ్యులు నాగరాజు అన్వర్ ఈశ్వర్ మల్లన్న బీసన్న భద్రకుమార్ సోమన్న aiyf జిల్లా ప్రధాన కార్యదర్శి కే శ్రీనివాసులు కౌన్సిల్స్ సభ్యులు అంజి రాము భారతి సులోచనమ్మ వెంకటేశ్వరమ్మ రబియా లక్ష్మి శేషమ్మ సోఫియా ఆశా బేగం మున్ని దేవి భాయ్ రామాంజి బాబయ్య కుమార్ మరియు శాఖ కార్యదర్శి లు పాల్గొన్నారు.