ఆర్డీఎస్ కుడికాలువకు నిధులు కేటాయించాలి
1 min read
రాయలసీమ ప్రాజెక్టులకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దారుణం
ఆర్డీఎస్ కుడి కాలువ సాధన సమితి ఆధ్వర్యంలో రెండోరోజు రిలే నిరాహార దీక్షలు
ఎమ్మిగనూరు, న్యూస్ నేడు : ఎమ్మిగనూరు పట్టణంలో సోమప్ప సర్కిల్లో ఆర్డీఎస్ సాధన సమితి ఆధ్వర్యంలో రెండవ రోజు రిలే నిరాహార దీక్షలో రెవెన్యూ డిపార్ట్మెంట్ సీనియర్ అసిస్టెంట్ హనుమంతరావుకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ఆర్డీఎస్ సాధన సమితి అధ్యక్షులు ఏనుగు బాల సత్యనారాయణ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దారుణమని రాయలసీమ పశ్చిమ ప్రాంతం వలసలతో విలవిల ఆడుతున్న పట్టించుకునే నాధుడే ఆ కరువయ్యాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు వలసలకు కరువుకు నిలయమైన మంత్రాలయం ఎమ్మిగనూరు వంటి నియోజకవర్గాలలో సాగు తాగు తాగునీరు అందించాలంటే ఆర్డిఎస్ కుడి కాలువను వెంటనే నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు అలాగే కన్వీనర్లు సిపిఐ రంగన్న బీసీ బతకన్నా నీలకంఠ మాట్లాడుతూ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2013 సంవత్సరంలోనే ఆర్డిఎస్ కుడి కాలువకు నాలుగు టిఎంసిల నికర జలాలు హక్కులుగా కేటాయించిందని 2019 జనవరిలో ఆనాటి టిడిపి ప్రభుత్వం జీవో నెంబర్ ద్వారా 1985 కోట్లు మంజూరు చేస్తూ ఆర్డిఎస్ కుడి కాలువకు నిర్మాణానికి పూనుకుందని ఇప్పటివరకు మీనమేషాలు లెక్కిస్తూ వస్తున్నారని అన్నారు ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఆర్డిఎస్ కుడి కాలువను పూర్తి చేయకపోతే ప్రజల వారీగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు కృష్ణ ఖాజా వెంకటేశు స్వామి దాసు సామ్సన్ అల్వాల పుల్లన్న వీర ప్రతాప్ రైతులు చిన్నన్న నతనీయులు నరసింహులు నాగరాజు పాల్గొన్నారు.
సంఘీభావం తెలిపిన వైఎస్ఆర్సిపి నాయకులు
ఎమ్మిగనూర్ పట్టణంలోని సోంపా సర్కిల్లో ఆర్డీఎస్ కుడికాలువ సాధన సమితి ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాలు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు మద్దతుగా వైఎస్ఆర్సిపి నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ మరియు వైఎస్ఆర్సిపి ఎమ్మిగనూరు పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప మరియు వైసీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్ సంఘీభావం తెలిపి వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బడ్జెట్లో రాయలసీమ ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోవడం అన్యాయమని గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి పోలికనుమ ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు ఇచ్చి తన యొక్క చిత్తశుద్ధిని చాటుకున్నారని వారు గుర్తు చేశారు ఇకనైనా కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలు మాని ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.