6వ డివిజన్ లో గడపగడపకు విజయవంతం..
1 min read
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు : 33వ రోజు గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సోమవారం స్థానిక 6వ డివిజన్ కార్పొరేటర్ సుంకర చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం తూర్పువీధి సెంటర్ నుండి ప్రారంభమైంది.కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని కి ఉప్పెనలా తరలి వచ్చిన మహిళల నుండి ఘన స్వాగతం లభించింది.పిలాస్ పేటలో ఏర్పాటుచేసిన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని శాసనసభ్యులు నాని ఆవిష్కరించారు.జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు,ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి గడపగడపకు వెళ్ళిన శాసనసభ్యులు నానివెంట డివిజన్ మహిళలు ఉప్పెనలా కదిలారు, శాసనసభ్యులు నాని తో పాటు ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు,పిళ్ళాంగోళ్ల శ్రీలక్ష్మి ,డిప్యూటీ మేయర్ నూక పెయ్యి సుధీర్ బాబు,బోద్దాని శ్రీనివాస్,ఎం ఆర్ డి బలరాం,మహమ్మద్ కైసర్, జుజ్జువరపు విజయనిర్మల, గడప గడపకు కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసిపి నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.