బసవ జయంతి ఊరేగింపు కు అనుమతి ఇవ్వండి
1 min read
మంత్రాలయం , న్యూస్ నేడు : నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం లో ఈనెల 30న నిర్వహించే బసవ జయంతి వేడుకలు ఊరేగింపు అనుమతి ఇవ్వాలని మంత్రాలయం వీరశైవ సంఘం, జంగమహేశ్వర సంగం నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణకి సోమవారం వినతి పత్రం ఇచ్చారు. పాత ఊరిలోని రామలింగేశ్వర స్వామి దేవాలయం నుంచి రాఘవేంద్ర కూడలి వరకు ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని , ఈ ఊరేగింపు కు అనుమతి ఇస్తూ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ శ్రీశైలం ట్రస్ట్ బోర్డు నెంబర్ సుజాత శంకర్, ఎల్లా లింగయ్య మహాబలేశ్వరప్ప, బండి మల్లికార్జున, మూలింటి చంద్రశేఖర్ గౌడ్, నగరూరు మల్లికార్జున, ఓం నమశ్శివాయ, తదితరులు పాల్గొన్నారు.