NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ్లోబల్ స్టార్.హీరో రామ్ చరణ్ జన్మదిన వేడుకలు

1 min read

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లో రామ్ చరణ్ టీం,మెగా అభిమానులు రక్తదానం

రాబోయే కాలంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ జన్మదిన సందర్భంగా రామ్ చరణ్ అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానులు జన్మదిన వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేసి తమ అభిమాన హీరో కి శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారం ఏలూరు అమీనా పేట  సర్వజన ఆసుపత్రి  ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భవనం వద్ద తల సేమియా వ్యాధిగ్రస్తులకు,రక్తం అత్యవసరమైన  వారికి అభిమానులు రక్తదానo కార్యక్రమం చేశారు. ప్రతి ఏటా అభిమానులు విరివిగా పాల్గొని  ఎంతోమంది అభిమానులను, సేవా దృక్పథం గల (బ్లడ్ డోనర్స్) రక్తదాతలను తీసుకొచ్చి  రక్తదానం ఏర్పాటు చేస్తారని రెడ్ క్రాస్ సొసైటీ పిఆర్ఓ కె.వి. రమణ తెలిపారు. ఈ సందర్భంగా మెగా అభిమానులు మాట్లాడుతూ ప్రతి ఏటా మెగా ఫ్యామిలీ జన్మదిన వేడుకలు సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలకు మేమంతా ఐక్యంగా సేవ చేయడానికి ముందుకొస్తామని రామ్ చరణ్ అభిమానులు అరవింద్,జగన్ తెలిపారు. అదేవిధంగా ఈరోజు రక్తదానం చేసిన ప్రతి ఒక్క అభిమానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

About Author