NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్టేట్ బ్యాంక్ ను ప్రారంభించిన సిజిఎం రాజేష్ కుమార్

1 min read

ఎస్ బిఐ సేవలను వినియోగించుకోండి..

న్యూస్ నేడు ఓర్వకల్లు: ఎస్ బిఐ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని అమరావతి సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ సిజియం రాజేష్ కుమార్ పటేల్ అన్నారు.కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండల కేంద్రంలో ఇకనుండి స్టేట్ బ్యాంక్ సేవలు ప్రజలకు అందనున్నాయి. గురువారం ఉదయం ఓర్వకల్లులో నూతనంగా నిర్మించినస్టేట్ బ్యాంకు ను ప్రారంభించారు.ఈ బ్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిజిఎం నూతన స్టేట్ బ్యాంకు ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.బ్రాంచ్ నుప్రత్యేకంగా పూల అలంకరణతో తీర్చిదిద్దారు. బ్యాంకులో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.ఓర్వకల్లుతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలను ప్రజలకు అందించనున్నామని ప్రజలు గమనించి బ్యాంకులో అకౌంట్ చేసుకోవాలని బ్రాంచ్ మేనేజర్ ఎన్.నవీన్ నరసింహ చౌదరి అన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ ఏవో కర్నూలు వి హేమ,రీజినల్ మేనేజర్ టి శ్రీనివాస్ మరియు వివిధ బ్రాంచ్ మేనేజర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

About Author