NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఓహెచ్​ఆర్ ట్యాంక్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ – ఆలూరు ఎమ్మెల్యే

1 min read

రూ.2 కోట్ల వ్యయం చేసినా పనులు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు – వెంటనే చర్యలు తీసుకోవాలని నాయకుల డిమాండ్

ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గంలో ఓహెచ్​ఆర్​ ట్యాంక్ నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే దాదాపు రూ.2 కోట్లు ఖర్చు చేసినప్పటికీ పనులు ఇంకా పూర్తికాకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి పనులను పూర్తి చేసి ప్రజలకు తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి  పాల్గొన్నారు. ఆయనతో పాటు వైసీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు, తేరేకల్ సురేంద్ర రెడ్డి , మల్లికార్జున రెడ్డి , శ్రీధర్ రెడ్డి , సర్పంచ్ అనిల్ కుమార్ రెడ్డి , ఎంపీపీ రంగయ్య , మండల కన్వీనర్ మల్లికార్జున , జిల్లా కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు మరియు వైయస్సార్​సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజల ప్రాథమిక అవసరాలైన తాగునీరు వంటి సమస్యలను త్వరగా పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

About Author