పోటీల్లో కోటా పాఠశాల విద్యార్థికి స్వర్ణ పథకం
1 min read
విద్యార్థిని అభినందించిన జిల్లా అధికారులు
నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో స్థానిక బైరెడ్డి నగర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల (కోటా)లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి “భాను ప్రసాద్” సమగ్ర శిక్ష,అమరావతి ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా,ఆగిరిపల్లి మండలం తోటపల్లి ‘హీల్ స్కూల్”లో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు నిర్వహించిన “రాష్ట్ర స్థాయి స్పెషల్ ఒలంపిక్స్ భారత్” క్రీడల్లో నంద్యాల జిల్లా తరఫున 50 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని స్వర్ణ పతకం సాధించాడు.పోటీలు ముగిసిన అనంతరం సమగ్ర శిక్ష అడిషనల్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్-2 రవీంద్రనాథ్ రెడ్డి చేతుల మీదుగా సర్టిఫికెట్ మరియు మెడల్ అందుకున్నారు.గురువారం ఉదయం విజయం నంద్యాల రైల్వే స్టేషన్ చేరుకున్న జట్టుకు నంద్యాల జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ ప్రేమంత కుమార్ మరియు సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి అభినందించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సాలమ్మ మాట్లాడుతూ భాను ప్రసాద్ పాఠశాలకు మంచి పేరు తీసుకుని వచ్చాడని ఇతను క్రీడల్లో మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో చాలా చురుకుగా ఉంటాడని ఇటువంటి వారికి చక్కని శిక్షణ ఇస్తే ఫలితాలు మెరుగ్గా వస్తాయని పేర్కొన్నారు. భాను ప్రసాద్ లోని నైపుణ్యాన్ని ప్రథమంగా గుర్తించి ప్రోత్సహించిన ఫిజికల్ డైరెక్టర్ పెరుమాళ్ళ శ్రీనాథ్ ను తమ కుమారుడిపై నమ్మకంతో క్రీడల్లో ప్రోత్సహిస్తున్న తల్లి తండ్రులు స్వర్ణలత,రవి కుమార్ లను క్రీడల్లో పాల్గొనడానికి అన్ని విధాల సహకరించిన”భవిత పాఠశాల”ఐఈఆర్టి రవి బాబు ను ప్రధానోపాధ్యాయులు అభినందించారు.భాను ప్రసాద్ ను పాఠశాల చైర్మన్ శ్రీనివాస రెడ్డి,పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు అరుణ విజయ భారతి,లలితమ్మ, శంషాద్ బేగం,సరోజిని దేవి,వెంకటరమణ వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది అభినందించారు.