NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పూర్వపు ప్రధానోపాధ్యాయులు  దామోదర్ కు ఘనంగా సన్మానం

1 min read

న్యూస్ నేడు, పత్తికొండ:  బెలగల్ మండలం మారం దొడ్డి గ్రామం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పనిచేస్తున్న పూర్వపు ప్రధానోపాధ్యాయుడు మరియు ప్రస్తుత బయాలజీ ఉపాధ్యాయులు దామోదర్ పదవీ విరమణ వేడుకను పాఠశాల సిబ్బంది మరియు మిత్రులు శ్రేయోభిలాషులు శాలువాలతో పూలమాలలతోఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ వేడుకను దామోదర్ మరియు వారి సతీమణి రాజేశ్వరిని జంటగా కూర్చోబెట్టి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమాన్ని ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సత్యవేదమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూర్వపు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కౌసల్యబాయి కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా  బెల్గల్ మండలం విద్యాశాఖ అధికారి- 2 ఆదం భాష హాజరయ్యారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, కేఆర్ దామోదర్  అంకితభావంతో పనిచేస్తూ ఉపాధ్యాయుడిగా అనేకమంది విద్యార్థినీ విద్యార్థులను తన వృత్తిలో తీర్చిదిద్దాడని వారు తెలియజేశారు ఆయన సుగుణ శీలి అని,శాంతస్వభావి అని కొనియాడారు. ఉపాధ్యాయులకు అనేక సలహాలు సూచనలు ఇచ్చే మంచి సలహాదారుడని తెలిపారు. ఆయన ప్రభుత్వ విద్యా పరిరక్షణకు ఎంతో కృషి చేశారని అన్నారు. అక్షర శిల్పి ,అజ్ఞాన తిమిర భాస్కరుడు ,గడచిన 35 వసంతాల పాటు నిరంతర విద్యార్థి లోక శ్రేయస్సే ధ్యేయంగా సేవలందించిన విద్యా మూర్తి ,అజాతశత్రువు, ఆదర్శ గురు శిఖరం, మృదుస్వభావి అని ఆయనను కొనియాడారు.ఈ కార్యక్రమంలో అరసం జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి సత్యనారాయణ , ఎస్టియు సీనియర్ నాయకులు కుంపటి నారాయణ, దేవదాసు, గోవింద నాయక్ మరియు వారి మిత్రులు ఉపాధ్యాయులైన వెంకటేశ్వర గౌడ్ మద్దయ్య, డోన్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ కృష్ణయ్య, భీమన్న, బీరప్ప, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *