NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అమీలీయో హాస్పిటల్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: అమీలీయో హాస్పిటల్‌లో భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఎండీ డా లక్ష్మి ప్రసాద్ చాపే మరియు  వైద్యులు, సిబ్బంది పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు.ఈ సందర్భంగా హాస్పిటల్ ఎం.డి. డా. లక్ష్మీ ప్రసాద్ చాపే  మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన కలిగి, వ్యాధులను ముందుగానే గుర్తించి తగిన వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ముఖ్యంగా షుగర్, థైరాయిడ్, గుండె సంబంధిత సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రోగులు, ప్రజల ప్రయోజనం కోసం ప్రత్యేక హెల్త్ చెకప్ ఆఫర్లు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు డా. లక్ష్మీ ప్రసాద్ చాపే తెలిపారు.

ప్రత్యేక పరీక్షల ఆఫర్లు

* షుగర్ టెస్ట్ – ₹1/- మాత్రమే

* HbA1c ప్రొఫైల్ – ₹99/-

* థైరాయిడ్ ప్రొఫైల్ – ₹99/-

* లిపిడ్ ప్రొఫైల్ – ₹99/-

కార్డియాక్ స్పెషల్ ప్యాకేజ్ – ₹1,947/-

సాధారణ ధర ₹12,930/- కాగా, ప్రత్యేక ఆఫర్‌లో *₹1,947/-*కే అందుబాటులో ఉంటుంది. ఇందులో 2D Echo, ECG, Chest X-Ray, Cardiac Risk Markers, Lipid Profile, Thyroid Profile, Renal & Liver Function Tests, HbA1c, Vitamin Profile, Iron Profile, Hemogram తదితర పరీక్షలు ఉంటాయి.

 డయాబెటిక్ స్పెషల్ ప్యాకేజ్ – ₹1,947/-

సాధారణ ధర ₹13,980/- కాగా, ప్రత్యేక ఆఫర్‌లో *₹1,947/-*కే అందుబాటులో ఉంటుంది. ఇందులో Advanced Diabetic Markers, HOMA-IR, C-Peptide, Fructosamine, Blood Ketones, Insulin Fasting, Urine Micro Albumin, HbA1c, Sugar Tests, Cardiac Risk Markers, Lipid Profile, Kidney & Liver Function Tests, Vitamin B12, Hemogram, Electrolytes, Pancreatic Markers, Complete Urine Examination తదితర పరీక్షలు ఉంటాయి. ఈ ప్రత్యేక ఆఫర్లు 2026 ఆగస్టు 15 నుంచి  16 తేదీలలో అందుబాటులో ఉంటాయని డా. లక్ష్మీ ప్రసాద్ చాపే తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో హాస్పిటల్ CFO M. కృష్ణ, COO B. రమేష్ బాబు,మార్కెటింగ్ మేనేజర్ ట్.రమేష్, వైద్యులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.ఆరోగ్యంపై ముందస్తు శ్రద్ధే… ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బలమైన పునాది.” అని డా. లక్ష్మీ ప్రసాద్ చాపే  పేర్కొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *