మొహారం పండుగ సందర్భంగా చందప్ప తాతకు ఘనంగా 10వ సంవత్సరం సేవ
1 min read
– భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు
హోళగుందన్యూస్ నేడు: మొహారం పండుగ సందర్భంగా హోళగుంద మండలంలోని రజక వీధిలో ఉన్న బాల మసీదులో కొలువైన చందప్ప తాతకు రజక సంఘం యువత ఆధ్వర్యంలో 10వ సంవత్సరం సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.10 వేల సేవను సమర్పించి, చందప్ప తాత ఆశీస్సులు పొందుతూ మొక్కులు తీర్చుకున్నారు.అనంతరం భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి, శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. హోళగుంద మండలంలోని వివిధ గ్రామాల్లో కొలువైన పీర్లను కూడా దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మొహారం పండుగను సోదరభావం, సామరస్యం ప్రతిబింబించేలా ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శివ, నాగరాజు, రమేష్, గది, ఏరురుమల్లి, సిద్దేటి, రవి, రాజా, రంగమల్లి, నాగప్ప, రాజు, ప్రకాష్, అబ్రేష్, ఈరన్న, వేణు, మహేష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


