మొహారం సందర్భంగా పీర్ల స్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే
1 min read
ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండల కేంద్రంలో మొహారం పండుగ సందర్భంగా ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి పీర్ల స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మొహారం పండుగ సోదరభావం, సామరస్యం, త్యాగానికి ప్రతీక అని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు పరస్పర ప్రేమాభిమానాలతో కలిసి జీవించడం సమాజానికి శ్రేయస్కరమని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు, ముస్లిం సోదరులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


