NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గురుకుల పాఠశాలలో మాదకద్రవ్యాలపై అవగాహన

1 min read

విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

ప్రొహిబిషన్ ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు..

నందికొట్కూరు న్యూస్ నేడు: మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని నందికొట్కూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు అన్నారు.నంద్యాల జిల్లా జుపాడుబంగ్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో శుక్రవారం అంతర్జాతీయ మాదకద్ర వ్యాల దినోత్సవం సందర్భంగా మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించారు.ఎస్ఐ లు జాఫురుల్లా,భాష్యం శ్రీనివాసులు హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ మూర్తి అధ్యక్షతన సమావేశం జరిగింది.ఈ సందర్భంగా సీఐ రామాంజనేయులు మాట్లాడుతూయువత దేశానికి వెన్నెముక. కానీ నేడు కొందరు యువకులు సరదాగా మొదలుపెట్టి మాదకద్రవ్యాల (డ్రగ్స్) బారిన పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. విద్యార్థి దశ నుంచే వ్యసనాలకు దూరంగా ఉండాలి.మాదకద్రవ్యాల రవాణా వినియోగం చట్టరీత్యా నేరం మీ పరిసరాల్లో ఎవరైనా డ్రగ్స్ లేదా గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించాలన్నారు.ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ ఉన్నత లక్ష్యాలతో చదువుకోవాలి విద్యార్థులు సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలి కానీ, ఇలాంటి చెడు అలవాట్లకు బానిసలు కాకూడదని అన్నారు.మానసిక ఒత్తిళ్లను అధిగమిస్తూ చదువు క్రీడలపై దృష్టి సారించాలి కానీ చెడు వ్యసనాలకు గురికావద్దని అన్నారు.జీవితంలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందన్నారు.విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ దామోదర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author