NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ్రీన్ పోస్టర్ కాంటెస్ట్ పోటీలు ప్రారంభం..

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:   అసోసియేషన్ ఆఫ్ అలియన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా 117s  ఆధ్వర్యంలో గ్రీన్ పోస్టర్ కాంటెస్ట్ పోటీలను నేడు గనులు మరియు భూగర్భ శాఖ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ నటరాజన్ నైస్ కంప్యూటర్స్ కార్యాలయంలో అసోసియేషన్ ఆఫ్ అలియాన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ అల్లీ అండ్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా నటరాజన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కొరకై కృషి చేయాలన్నారు. అసోసియేషన్ ఆఫ్ అలియన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ చిన్నారులకు వాతావరణ కాలుష్యం వల్ల కలిగే అనర్థాలను తల్లిదండ్రులు అవగాహన కలిగించేలా ప్రోత్సహించాలన్నారు.సిటీ స్థాయిలో పాఠశాలల వారీగా గెలుపొందిన వారితో జిల్లా స్థాయి పోటీలను నిర్వహించి జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొందిన వారిని రాష్ట్రస్థాయికి అంతర్జాతీయ స్థాయికి పంపించమన్నామన్నారు. రిటైర్డ్ తాసిల్దార్ తిరుపతి సాయి మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ వ్యర్థ్యాలను  రిసైక్లింగ్ కు పంపించేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ కే.డి. జె బాబు మాట్లాడుతూ పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ ప్రాజెక్టు రాయపాటి మార్దవ్, లక్ష్మీ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షురాలు రాయపాటి నాగలక్ష్మి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author