NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విశ్వాసం అద్భుత కార్యాలను సాధిస్తుంది

1 min read

డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తి.తి.దే.

జూపాడుబంగ్లాలో ప్రారంభమైన తి.తి.దే. ధార్మిక కార్యక్రమాలు.

కర్నూలు, న్యూస్​ నేడు:  విశ్వాసం అనేది మనిషి జీవితాన్ని మార్చగల మహాశక్తిఅని, ధర్మంపై విశ్వాసం, దైవంపై అచంచల విశ్వాసం ఉన్న వ్యక్తి ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా అధిగమించగలడని, విశ్వాసం ఉన్న చోట భయం తగ్గి, ధైర్యం పెరుగుతుందని, అసాధ్యమైన కార్యం కూడా సుసాధ్యమవుతుందని, మన ఇతిహాసాలు, పురాణాలు ఇదే చాటుతున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఆధ్వర్యంలో మండలకేంద్రమైన జూపాడుబంగ్లాలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంనందు వారు నాలుగు రోజుల ధార్మిక కార్యక్రమాలకు వారు ప్రారంబోపన్యాసం చేశారు. తదనంతరం జి. వేంకట రమణయ్య శ్రీమద్రామాయణంపై ప్రవచించారు. ఈ కార్యక్రమంలో ఆలయకమిటీ నిర్వాహకులు ఇల్లూరి లక్ష్మీనారాయణ శ్రేష్ఠి, ధర్మ ప్రచార మండలి సభ్యులు అంబటి శివశంకర రెడ్డి,పుల్లయ్య, తిరుపాల్, జె. నాగపుల్లయ్య,  రామయ్య, కృష్ణమూర్తి, నాగశేషులు, సిపాయి మల్లిఖార్జున గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

About Author