NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పల్లెపండుగ 3.0లో అభివృద్ధి పనులకు భూమిపూజ

1 min read

రూ.10 లక్షలతో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలోని మాధవరం, గుడిపాడు, కలచట్ల గ్రామాల్లో పల్లెపండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులకు డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి భూమిపూజ చేశారు. గ్రామాల్లో రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులను ప్రారంభించేందుకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో చేపడుతున్నామని తెలిపారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నందుకు గ్రామస్థులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు లక్కసాగరం లక్ష్మిరెడ్డి, ఎద్దులదొడ్డి ప్రభాకర్ రెడ్డి, బత్తుల రామేష్ రెడ్డి, డోన్ మార్కెట్ యార్డు చైర్మన్ రాజా రేణుక, రాజా నారాయణమూర్తి, మండల కన్వీనర్ సుదర్శన్, గోళ్ల రామ్మోహన్ యాదవ్, మాధవరం స్వామి, రాము, గుడిపాడు వెంకట్ రెడ్డి, ఓబులేసు, కలచట్ల ప్రసాద్, రంగస్వామి, పులసి దస్తగిరి, మహేంద్ర తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *