ఎంపీ చేతుల మీదుగా ప్రారంభమైన ఎస్ఆర్ నూతన షాపింగ్ మాల్
1 min read
నాణ్యమైన వస్త్రాలతో ప్రజల మన్ననలు పొందుతూ,సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్ష
అన్ని వర్గాల వారికి అందుబాటు ధరల్లో మన హేలాపురి నగరంలో
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు నగరంలోని ఆర్ఆర్ పేటలో నూతనంగా నెలకొల్పిన ఎస్ ఆర్ షాపింగ్ మాల్” ను బుధవారం ఉదయం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఉదయం 10.30 గంటల సమయంలో ఆర్ఆర్ పేట వచ్చిన ఎంపీకి షాపింగ్ మాల్ అధిపతి గోపీనాథ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. రిబ్బన్ కట్ చేసి షాపింగ్ మాల్ ను ప్రారంభించిన ఎంపీకి సంస్థ ప్రతినిధులు భవనం అంతా చూపిస్తూ వస్త్రాల సేకరణ, అమ్మకంలో తమ సంస్థ ప్రత్యేకతలను వివరించారు. నాణ్యమైన వస్త్రాలతో ప్రజల మన్ననలు పొందుతూ అన్ని వర్గాల వారికి అందుబాటు ధరల్లో మన హేలాపురి నగరంలో , సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆకాంక్షించారు.


