ఎన్నికల నగారా..పల్లెలో ఎన్నికల హీట్
1 min read
మిడుతూర్ జడ్పిటీసీ-బీసీ మహిళ,ఎంపీపీ ఎస్సీ-జనరల్..
మిడుతూరు న్యూస్ నేడు: రాష్ట్రంలో జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల షెడ్యూల్ నగారా మోగింది. బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది.నిన్నటి నుండే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.నంద్యాల జిల్లా జిల్లా మిడుతూరు జడ్పిటిసి-బీసీ మహిళ.. ఎంపీపీ-ఎస్సీ జనరల్ కు రిజర్వేషన్ కల్పిస్తూ సంబంధించిన గెజిట్ ను జిల్లా కలెక్టర్ జి రాజకుమారి విడుదల చేశారు.అదేవిధంగా మిడుతూరు మండలంలో
12 ఎంపీటీసీలకు రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి
అలగనూరు-ఎస్సీ, నాగలూటి-అన్ రిజర్వుడు స్త్రీ,చింతలపల్లి-అన్ రిజర్వుడు స్త్రీ,మాసపేట- బిసి,వీపనగండ్ల-అన్ రిజర్వుడ్ స్త్రీ,మిడుతూరు 1,2- అన్ రిజర్వ్,చౌటుకూరు-అన్ రిజర్వ్,చెరుకుచెర్ల-ఎస్సీ స్త్రీ,తలముడిపి-బీసీ స్త్రీ, కడుమూరు-బీసీ, జలకనూరు-ఎస్సీ స్త్రీ రిజర్వేషన్ కల్పిస్తూ కలెక్టర్ గెజిట్ విడుదల చేశారు. దీంతో ఎంపీటీసీ,జడ్పిటిసి కేటాయింపులో కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది.ఇక ఎన్నికల బరిలో నిలిచేదెవరో.?గెలిచేదెవరో.? అంటూ పల్లెల్లో ఎన్నికల హీట్ పెరగనుందా అంటూ చర్చనీయంగా మారింది.
నవంబర్ 3న ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలు
వచ్చేనెల నవంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. 5వ తేదీన ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.


