NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గుగ్గిళ్ల రమణ మృతి… టీడీపీకి తీరని లోటు

1 min read

పల్లెవెలుగు రాయచోటి/వీరబల్లి: టిడిపి వీరబల్లి మండలంలో మంచి నాయకుడు ను కోల్పోయిందని టిడిపి రాజంపేట ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు పేర్కొన్నారు. గురువారం మండలంలోని సానిపాయి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకుడు గుగిళ్ళ రమణ దశదిన కర్మ కార్యక్రమానికి చెంగల్రాయుడుతోపాటు టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి చమర్తి జగన్మోహన్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా రమణ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు. వారు మాట్లాడుతూ నిజాయితీ, నిబద్ధతతో టీ డీ పీ కి సేవలు చేసిన ఘనత రమణ కే చెందుతుందన్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులందరితో సత్సంబంధాలు కొనసాగిస్తూ..పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేసిన గుగ్గిళ్ల రమణ మృతి పార్టీకి తీరని లోటన్నారు. ఆయన కుటుంబానికి టిడిపి అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు రెడ్డప్ప రెడ్డి, డాక్టర్ అమరేశ్వర్ రాజు, కొల్లి వెంకటరమణ నాయుడు, హరినాథ్ రెడ్డి, సుండుపల్లి శివకుమార్ నాయుడు, నాగభూషణం నాయుడు, మట్లి సర్పంచ్ నాగార్జున ఆచారి, జయచంద్రా రెడ్డి, మాజీ సర్పంచ్ రమణ, ఆంజనేయులు, భాస్కర్ రాజు, ప్రసాద్ రాజు, సుధాకర్ రాజు, జయరామ్ యాదవ్, తదతరులు పాల్గొన్నారు.

About Author