శీతకాలంలో పెరుగుతున్న హార్ట్ ఎటాక్స్ – తీసుకోవాల్సిన జాగ్రత్తలు
1 min read

డాక్టర్ మూడే సందీప్ సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్
కిమ్స్ సవీర, అనంతపురం
అనంతపురం, న్యూస్ నేడు: శీతాకాలంలో హార్ట్ ఎటాక్ ప్రమాదం నిజంగా కొంచెం ఎక్కువగా ఉంటుంది. శీతకాలంలో శరీరంలో సింపాతటిక్ యాక్టివిటీ అధికంగా ఉండటం వలన రక్తనాళాలు కుదించుకుపోవడం, రక్తపోటు పెరగడం, ఉదయం వేళల్లో శరీరంపై ఒక్కసారిగా ఒత్తిడి పడటం వంటి కారణాలతో ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి గుండె జబ్బు ఉన్నవారు వెచ్చటి దుస్తులు వేసుకోవడం, షుగర్ మరియు బిపిని అదుపులో ఉంచుకోవాలి. అధికంగా వ్యాయామం చేయకూడదు, మందులు సమయానికి వాడడం చాలా ముఖ్యం. ఛాతిలో నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, చెమటలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లాలి.”శీతాకాలంలో హార్ట్ పేషెంట్లు తీసుకోవాల్సిన – ప్రధాన జాగ్రత్తలు ఇవి: – ఉదయం చాలా చలిగా ఉన్నప్పుడు నేరుగా బయటకు వెళ్లకుండా, కొద్ది సేపు ఇంట్లోనే నడక, వ్యాయామం చేసి శరీరాన్ని వార్మ్ చేసి బయటికి వెళ్లాలి. శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉండే విధంగా చూసుకోవాలి- బీపీ, షుగర్ ఉన్నవారు రక్తపోటు, రక్తంలో గ్లూకోజ్‌ను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి; అవసరమైతే డాక్టర్ సలహా మేరకు మందుల డోసులను సర్దుబాటు చేసుకోవాలి.- ఫిజికల్ యాక్టివిటీ పూర్తిగా ఆపివేయకుండా, నడక, లైట్ ఎక్సర్‌సైజ్, యోగా లాంటి సాఫ్ట్ యాక్టివిటీలను రోజూ కొనసాగించడం గుండె ఆరోగ్యానికి మంచిది.- సిగరెట్, ఆల్కహాల్ వంటివి రక్తనాళాలపై ఎక్కువ హానికరం చూపుతాయి కాబట్టి వీటిని మానేయడం మరింత అవసరం.- హార్ట్ ఎటాక్ సూచించే ముఖ్య లక్షణాలు – ఛాతీలో నొప్పి లేదా బరువు, ఎడమ చేతి, దవడ, వెన్నుకు వ్యాపించే నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, చల్లటి చెమటలు, తీవ్రమైన అలసట. ఇటువంటి లక్షణాలు 10–15 నిమిషాలకు మించి ఉంటే ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా దగ్గరలో ఉన్న ఎమర్జెన్సీ ఆసుపత్రికి వెళ్లాలి.

