రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ను కలిసిన జనసేన పార్టీ ఇంచార్జ్
1 min read

మంత్రాలయం న్యూస్ నేడు : మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ ను మంత్రాలయం జనసేన పార్టీ ఇంచార్జ్ బి .లక్ష్మన్న మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారికి శాలువా కప్పి రాఘవేంద్ర స్వామి మెమోంటో ఇచ్చి సన్మానించారు. అలాగే హైదరాబాదులోని జనసేన పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ ఆయన ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రాలయం నియోజకవర్గం లో జనసేన పార్టీని బలోపేతం, తదితర సమస్యలపై ఆయన తో చర్చించారు. ఈ కార్యక్రమంలో కౌతాళం మండల జనసేన పార్టీ అధ్యక్షులు సుమిత్ర, కోసిగి మండలం అధ్యక్షులు వీరారెడ్డి, పెద్ద కడుబూరు మండల అధ్యక్షులు బజారి, జనసేన కార్యకర్తలు ఉన్నారు.

