హెవీ మోటార్ వెహికల్ డ్రైవర్ ఎంపిక ఇంటర్వ్యూలు విజయవంతంగా పూర్తి
1 min read

నంద్యాల, న్యూస్ నేడు : నంద్యాల జిల్లాకు సంబంధించి బుధవారం జిల్లా రవాణా అధికారి కార్యాలయం ఛాంబర్లో హెవీ మోటార్ వెహికల్ డ్రైవర్ పోస్టుల ఇంటర్వ్యూలు విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి కే.తులసీదేవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ ఇంటర్వ్యూలను జిల్లా రవాణా అధికారి, నంద్యాల ఆర్టీసీ డిపో మేనేజర్, డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్, ఆఫీస్ సూపరింటెండెంట్ (నంద్యాల డిపో), ఎస్‌సి కార్పొరేషన్ కర్నూలు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌లతో కూడిన కమిటీ ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహించినట్లు తెలిపారు.మొత్తం 14 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 12 మంది ఇంటర్వ్యూకు హాజరయ్యారు. వారిలో 10 మందిని ఎంపిక చేశారు. ఎంపికైన వారిలో ఒక మహిళా అభ్యర్థి ఉన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ సీనియారిటీ మరియు వయస్సు ప్రమాణాల ఆధారంగా ఎంపిక జరిగిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి శివశంకర్ రెడ్డి, ఆర్టీసీ డిఎం వినయ్ కుమార్, డ్రైవింగ్ స్కూల్ ఇన్స్ట్రక్టర్ ఏ సుధాకర్ ఎస్సీ కార్పొరేషన్ ఈవో ఎం విజయలక్ష్మి, దరఖాస్తుదారులు తదితరులు పాల్గొన్నారు.

