ఇమామ్, మౌజాంలకు గౌరవ వేతనాలు విడుదల చేయాలి
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: రాష్ట్రంలోని ఇమామ్, మౌజాంలకు గౌరవ వేతనం మంజూరు చేయాలని జిల్లా కాంగ్రెస్ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ షేక్ ఖాజా హుస్సేన్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి వెలువడిన పత్రిక ప్రకటనలో ఖాజా హుస్సేన్ మాట్లాడుతూ ఇమామ్, మౌజాంలకు 9 నెలల నుండి టీడీపీ ప్రభుత్వంలో గౌరవ వేతనాలు ఇవ్వడం లేదని గత ప్రభుత్వంలో ప్రతినెల వారి అకౌంటులో జమ అయ్యేవని వారికి ప్రతి నెల వేతనాలు అందే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ ఆదేశాలు ఇచ్చి వారి నిధులు విడుదల చేయాలని తెలియజేశారు. అలాగే ఉర్దూ యూనివర్సిటీ భవనం శిథిలావస్థకు చేరిందని గత టిడిపి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు భవనానికి శంకుస్థాపన చేశారని అది నిర్మాణం మధ్యలో ఆగిపోయిందని ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొని భవనాన్ని పూర్తి చేయాలని ఖాజా హుస్సేన్ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష, ఐ ఎన్ టి యు సి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఖాద్రి పాషా, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి వశీభాష, మైనార్టీ సెల్ సిటీ అధ్యక్షులు అబ్దుల్ హై మొదలగు వారు పాల్గొన్నారు.

